ఆంథ్రోపిక్ సోర్స్ కోడ్ లీక్... మానవ తప్పిదం వల్ల జరిగిందన్న కంపెనీ

Anthropic Source Code Leaked Due to Human Error
  • ఆంథ్రోపిక్ సోర్స్ కోడ్ లీక్‌పై సామాజిక మాధ్యమాల్లో చర్చ
  • భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పే కంపెనీ సోర్స్ కోడ్‌ను కాపాడుకోలేకపోయిందని విమర్శలు
  • భవిష్యత్తులో ఇలా జరగకుండా చూస్తామన్న ఆంథ్రోపిక్
ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఆంథ్రోపిక్‌కు చెందిన సోర్స్ కోడ్ ఆన్‌లైన్‌లో లీకవ్వడం టెక్ ప్రపంచంలో కలకలం రేపింది. తన క్లాడ్ కోడ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోడ్‌ను ఆంథ్రోపిక్ ఎన్‌పీఎం రిజిస్ట్రీలో ఉంచగా, అది బహిర్గతమైంది. క్లాడ్ కోడ్ ఎలా పనిచేస్తుంది, దాని ఆర్కిటెక్చర్ ఏమిటి వంటి వివరాలు అందులో ఉన్నాయి.

సోర్స్ కోడ్ లీక్‌ను ఆంథ్రోపిక్ కూడా ధృవీకరించింది. మానవ తప్పిదం వల్ల జరిగినట్లు తెలిపింది. భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకుంటామని తెలిపింది. వినియోగదారుల డేటా కానీ, ఏఐ మోడల్స్ కానీ లీక్ అవలేదని తెలిపింది.

సోర్స్ కోడ్ లీక్ కావడంపై ఆంథ్రోపిక్ మీద విమర్శలు వస్తున్నాయి. తాము భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పే ఆంథ్రోపిక్ తన సోర్స్ కోడ్‌ను కాపాడుకోలేకపోయిందని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా, ఆంథ్రోపిక్ 380 బిలియన్ డాలర్ల ఐపీవోకు సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో సోర్స్ కోడ్ లీక్ కావడం ఆ సంస్థకు ఎదురుదెబ్బ అని భావిస్తున్నారు.
Advertisement
Anthropic
Anthropic source code leak
Claude code
AI source code
Artificial intelligence
NPM Registry

More Telugu News