India vs Zimbabwe: భారత్-జింబాబ్వే మధ్య రెండు సిరీస్‌లు.. షెడ్యూల్ విడుదల
టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా మరో అంతర్జాతీయ సిరీస్‌కు సిద్ధమైంది. ఈ ఏడాది జులైలో జింబాబ్వేలో పర్యటించి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొననుంది. ఈ మేరకు జింబాబ్వే క్రికెట్ (ZC) బోర్డు ఇవాళ అధికారిక ప్రకటన విడుదల చేసింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జులై 23, 25, 26 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం అన్ని మ్యాచ్‌లు సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతాయి.
ఇటీవల ముగిసిన 2026 టీ20 ప్రపంచకప్‌లోనూ ఇరు జట్లు తలపడ్డాయి. చెన్నైలో జరిగిన సూపర్-8 దశ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో జింబాబ్వేపై ఘన విజయం సాధించింది. అంతకుముందు 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన వెంటనే కూడా టీమిండియా జింబాబ్వేలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడి 4-1 తేడాతో గెలుపొందింది. తాజా ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి బలమైన జట్లు ఉన్న గ్రూప్‌లో టాప్‌లో నిలిచి సూపర్-8కు చేరిన జింబాబ్వే, అదే జోరును సొంతగడ్డపై కొనసాగించాలని భావిస్తోంది.
ఈ సిరీస్‌పై జింబాబ్వే క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ గివ్మోర్ మకోనీ మాట్లాడుతూ.. "భారత్‌తో మ్యాచ్‌లంటే ఎప్పుడూ భారీ ఆసక్తి ఉంటుంది. ప్రపంచ ఛాంపియన్లతో సొంతగడ్డపై తలపడటం మా ఆటగాళ్లకు ఒక గొప్ప అవకాశం. ప్రపంచకప్‌లో మా ప్రదర్శన ప్రోత్సాహకరంగా ఉంది. ఈ సిరీస్ ద్వారా ఆ జోరును కొనసాగించి, అంతర్జాతీయ క్రికెట్లో మరింత పోటీ శక్తిగా ఎదగడానికి ఇది బలమైన పునాది వేస్తుంది" అని వివరించారు.
ఇక, వచ్చే ఏడాది ఆరంభంలో జింబాబ్వే జట్టు భారత్‌లో పర్యటించనున్నట్లు బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది. 2027 జనవరిలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. కోల్‌కతా (జనవరి 3), హైదరాబాద్ (జనవరి 6), ముంబై (జనవరి 9) ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. దాదాపు 25 ఏళ్ల తర్వాత జింబాబ్వే జట్టు భారత్‌లో ద్వైపాక్షిక సిరీస్ ఆడనుండటం విశేషం. చివరిసారిగా 2002 మార్చిలో జింబాబ్వే భారత్‌లో పర్యటించింది.
ఈ సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌లో పర్యటించడంపై మకోనీ సంతోషం వ్యక్తం చేశారు. "రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ద్వైపాక్షిక సిరీస్ కోసం భారత్‌లో పర్యటించడం ఒక చారిత్రాత్మక క్షణం. ఇది మా ఆటగాళ్లకు దక్కిన గౌరవం, విలువైన అవకాశం. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, మా జట్టుకు ఎంతో అనుభవాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం" అని తెలిపారు.