Tirumala: తిరుమల శ్రీవారికి నిన్న ఒక్కరోజే రూ.5 కోట్లకు పైగా ఆదాయం

Tirumala Temple Receives Over 5 Crore Rupees in Revenue in One Day
షార్ట్స్‌లో చూడండి
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిన్న భారీ ఆదాయం లభించింది. సోమవారం (మార్చి 30) ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.08 కోట్లుగా నమోదైంది. భక్తుల రద్దీ ఓ మోస్తరుగా  కొనసాగుతోంది.

సోమవారం మొత్తం 70,044 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారికి మొక్కులు చెల్లించుకునే క్రమంలో భాగంగా 27,241 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. 

ప్రస్తుతం భక్తుల రద్దీ కారణంగా తిరుమలలోని 20 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టైమ్‌స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 8 నుంచి 12 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు.

భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు క్యూలైన్లలోని వారికి తాగునీరు, ఆహారం వంటి సౌకర్యాలు కల్పిస్తూ దర్శన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 


Go Back to Shorts
Tirumala
Tirumala temple
Tirupati
Lord Venkateswara
Srivari Hundi
Temple revenue
Pilgrims
TTD
Andhra Pradesh temples
Devotees

More Telugu News