Pawan Kalyan: పవన్ కల్యాణ్ శాఖకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట.. 24వ స్థానం నుంచి అగ్రస్థానానికి ఏపీ

Pawan Kalyans Department Wins National Awards for Andhra Pradesh
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో సత్తా చాటింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వం వహిస్తున్న ఈ శాఖకు ఏకంగా ఐదు జాతీయ పురస్కారాలు లభించాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, సేవల విస్తరణలో కనబరిచిన అత్యుత్తమ పనితీరుకు గానూ కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది.

వివరాల్లోకి వెళితే... రాష్ట్రీయ గ్రామస్వరాజ్‌ అభియాన్‌, జల్‌ సంచయ్‌-జన్‌ భాగీదారి అనే రెండు కీలక విభాగాల్లో ఏపీ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. మరో విభాగంలో ద్వితీయ స్థానం, ఇంకో రెండు విభాగాల్లో తృతీయ స్థానం దక్కించుకుని మొత్తం ఐదు అవార్డులను కైవసం చేసుకుంది. గ్రామ పంచాయతీలను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడం, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని ప్రోత్సహించే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్‌లో ఏపీ పనితీరు విశేషంగా మెరుగుపడింది. గత ప్రభుత్వ హయాంలో ఇదే విభాగంలో 24వ స్థానంలో ఉన్న రాష్ట్రం, ఇప్పుడు దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. అలాగే, తక్కువ ఖర్చుతో వర్షపు నీటిని నిల్వ చేసే పద్ధతులను ప్రోత్సహించే 'జల్ సంచయ్ - జన్ భాగీదారీ' కార్యక్రమంలోనూ ఏపీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీటి సౌకర్యాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే 'పల్లెపండుగ 1.0', 'పల్లెపండుగ 2.0' వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో గ్రామసభలు నిర్వహించి, ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు.

గ్రామసభలలో వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా 'పల్లెవెలుగు' కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే శాఖ పనితీరు గణనీయంగా మెరుగుపడి, జాతీయ స్థాయిలో ఈ పురస్కారాలు దక్కడం విశేషం.
Go Back to Shorts
Pawan Kalyan
Andhra Pradesh
Panchayat Raj
National Awards
Rural Development
Grama Swaraj Abhiyan
Jal Sanchay
AP Government
Palle Panduga
Village Development

More Telugu News