Telangana Assembly: ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. సోమవారం ద్రవ్య వినిమయ బిల్లు - 2026కు సభ ఆమోదం తెలిపిన అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.

ఈ బడ్జెట్ సమావేశాలు మొత్తం 10 రోజుల పాటు జరిగాయి. ఈ సెషన్‌లో సభా కార్యకలాపాలు మొత్తం 82 గంటల 47 నిమిషాల పాటు కొనసాగాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 11 బిల్లులను ప్రవేశపెట్టగా, వాటిలో 10 బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. మరొక బిల్లును తదుపరి పరిశీలన నిమిత్తం సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేశారు.

ద్రవ్య వినిమయ బిల్లుతో పాటు, ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ బిల్లు – 2026, అడ్వకేట్ల పరిరక్షణ బిల్లు - 2026 వంటి కీలక బిల్లులకు కూడా సభ ఆమోదముద్ర వేసింది. వీటితో పాటు మూడు ప్రభుత్వ తీర్మానాలను కూడా ఆమోదించారు.
 
Telangana Assembly
Telangana Budget Session
Gaddam Prasad Kumar
Telangana Assembly Session 2026
Telangana Bills Passed
Gig Workers Bill
Advocates Protection Bill
Telangana Government Resolutions

More Telugu News