Chintada Ravindra: విశాఖలో దారుణం.. స్నేహితురాలిని చంపి, ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
విశాఖపట్నంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ నౌకాదళ ఉద్యోగి తన స్నేహితురాలిని అతి కిరాతకంగా హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. గాజువాక పరిధిలోని ఎల్.వి.నగర్‌లో ఆదివారం రాత్రి ఈ ఘోరం జరిగింది. నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లా రాజాంకు చెందిన చింతాడ రవీంద్ర (35) నేవీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతడికి విశాఖకు చెందిన మౌనిక (29) అనే యువతితో పరిచయం ఉంది. ఆదివారం రాత్రి ఆమెను తన ఫ్లాట్‌కు పిలిచిన రవీంద్ర అత్యంత పాశవికంగా హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి, రెండు మూటల్లో కట్టి ఫ్రిజ్‌లో దాచాడు. ఈ ఘాతుకం తర్వాత అతడే స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫ్రిజ్‌లో ఉన్న శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, మృతురాలి తల భాగం ఇంకా లభ్యం కాలేదని, దాని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రవీంద్ర భార్య నెల రోజుల క్రితమే పుట్టింటికి వెళ్లినట్లు తెలిసింది.
డబ్బుల కోసం మౌనిక తనను వేధిస్తోందని, ఆ ఒత్తిడి భరించలేకే ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు చేస్తున్నారు.