Rohit Sharma: భారీ ఇన్నింగ్స్‌తో రోహిత్ రికార్డుల మోత.. కోహ్లీని వెనక్కి నెట్టిన హిట్‌మ్యాన్
ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో, ఒత్తిడిలో సూపర్ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో తన 50వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. భారీ లక్ష్య ఛేదనలో కేవలం 39 బంతుల్లోనే 78 పరుగులు చేసి, ఒకే మ్యాచ్‌లో రెండు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
కోల్‌కతా నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. తన అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రలో 50 లేదా అంతకంటే ఎక్కువ సార్లు యాభైకి పైగా స్కోర్లు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (72), డేవిడ్ వార్నర్ (66), శిఖర్ ధావన్ (53) మాత్రమే రోహిత్ కంటే ముందున్నారు. ఈ మైలురాయిని అందుకోవడం ద్వారా రోహిత్ ఓ ఎలైట్ క్లబ్‌లో చేరాడు.
ఒకే ప్రత్యర్థిపై అత్యధిక పరుగులతో సరికొత్త చరిత్ర
ఇదే మ్యాచ్‌లో మరో అరుదైన ఘనతను కూడా హిట్ మ్యాన్ సాధించాడు. ఐపీఎల్‌లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. కోల్‌కతాపై ఇప్పటివరకు 1161 పరుగులు చేసిన రోహిత్, పంజాబ్ కింగ్స్‌పై విరాట్ కోహ్లీ చేసిన 1159 పరుగుల రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్‌తో కలిసి రోహిత్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 148 పరుగులు జోడించారు. కోల్‌కతాపై ముంబై ఇండియన్స్‌కు ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం. అంతకుముందు కెప్టెన్ అజింక్యా రహానే (67), అంగ్క్రిష్ రఘువంశీ (51) హాఫ్ సెంచరీలతో కోల్‌కతా 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, రోహిత్ అద్భుత ఇన్నింగ్స్‌తో ముంబై విజయం సులువైంది. ప్రమాదకరంగా మారుతున్న రోహిత్‌ను అనుకుల్ రాయ్ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్ పంపడంతో ఈ ఇన్నింగ్స్‌కు తెరపడింది.