Ranveer Singh: 'ధురంధర్' మావల్లే హిట్టయింది.. మాకూ వాటా ఇవ్వాలి: ల్యారీ ప్రజల వింత డిమాండ్
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా విజయం ఇప్పుడు ఒక కొత్త చర్చకు దారితీసింది. ఈ చిత్రంలో తమ ప్రాంతం పేరును ఉపయోగించుకున్నందుకు, సినిమా ఆదాయంలో తమకు వాటా ఇవ్వాలంటూ పాకిస్థాన్‌లోని ల్యారీ పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కరాచీలోని ల్యారీ ప్రాంత నేపథ్యంలో తెరకెక్కింది. 'ఆపరేషన్ ధురంధర్' పేరుతో భారత ఏజెంట్ ఒకరు అక్కడి ఉగ్రవాద స్థావరాలను ఎలా నాశనం చేశాడన్నదే కథాంశం. తమ నగరం పేరును వాడుకుని వందల కోట్లు సంపాదిస్తున్నారని, కాబట్టి ఆ ఆదాయంలో కొంత భాగాన్ని తమ ప్రాంత అభివృద్ధికి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించాలని ల్యారీ వాసులు కోరుతున్నారు.
ఈ డిమాండ్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ ప్రాంతాన్ని వాడుకున్నందుకు చిత్ర నిర్మాతలు బాధ్యత వహించాలని వారు అభిప్రాయపడుతున్నారు. సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది.