TDP: కృష్ణా నదిలో పసుపు తోరణం: టీడీపీకి మత్స్యకారుల వినూత్న శుభాకాంక్షలు!

Fishermen Wish Telugu Desam Party With Yellow Festoons in Krishna River
షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కృష్ణా నది సాక్షిగా మత్స్యకారులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ సమీపంలో కృష్ణా నదిలో భారీ పడవల ర్యాలీ నిర్వహించారు. డజన్ల కొద్దీ పడవలకు పార్టీ జెండాలను కట్టి, పసుపు తోరణంగా మార్చి నదిలో ప్రదర్శనగా ముందుకు సాగారు.

టీడీపీ తమకు ఎల్లప్పుడూ అండగా నిలిచిందని, పార్టీ పట్ల తమ కృతజ్ఞతను చాటుకునేందుకే ఈ ర్యాలీ చేపట్టామని మత్స్యకారులు తెలిపారు. కృష్ణా నదిలో పసుపు జెండాల మధ్య పడవలు ప్రయాణిస్తున్న దృశ్యం చూపరులను ఆకట్టుకుంది.


Go Back to Shorts
TDP
Telugu Desam Party
Krishna River
Fishermen
Vijayawada
Prakasam Barrage
TDP Formation Day
Andhra Pradesh Politics
Boat Rally
Yellow Flags

More Telugu News