Apple: భారత్‌లో ఐఫోన్ ప్రియులకు షాక్.. పెరగనున్న పాత మోడళ్ల ధరలు!
భారత్‌లో ఐఫోన్ కొనాలనుకునే వారికి ఇది కొంత నిరాశ కలిగించే వార్త. టెక్ దిగ్గజం యాపిల్ తీసుకున్న ఒక కీలక నిర్ణయంతో పాత ఐఫోన్ మోడళ్ల ధరలు పెరగనున్నాయి. రిటైలర్లకు అందిస్తున్న ప్రోత్సాహకాలను నిలిపివేయడంతో, వినియోగదారులు ఐఫోన్ 14, 15 వంటి పాత సిరీస్ మోడళ్లపై సుమారు రూ.5,000 వరకు అదనంగా చెల్లించాల్సి రావచ్చు.
ఇంతకాలం యాపిల్ తన ఆఫ్‌లైన్ రిటైల్ భాగస్వాములకు డిమాండ్ జనరేషన్ (డీజీ) సపోర్ట్ పేరుతో కొన్ని ప్రోత్సాహకాలను అందించేది. దీనివల్ల రిటైలర్లు ఫోన్ అధికారిక ధర (ఎంఆర్పీ)పై వినియోగదారులకు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఇవ్వగలిగేవారు. అయితే, ఇప్పుడు యాపిల్ ఈ సపోర్ట్‌ను నిలిపివేస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. దీంతో రిటైలర్లు ఇకపై భారీ తగ్గింపులు ప్రకటించే అవకాశం ఉండదు. ఈ నిర్ణయం వల్ల ఫోన్ల అధికారిక ధరలో ఎటువంటి మార్పు ఉండదు. కానీ, డిస్కౌంట్లు తగ్గడం వల్ల వినియోగదారుడు చెల్లించే తుది ధర పెరుగుతుంది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో పాత ఐఫోన్ మోడల్‌ను కొనుగోలు చేయాలని భావించే వారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
మార్కెట్‌లో ధరలపై మరింత నియంత్రణ సాధించడం, పాత, కొత్త మోడళ్ల మధ్య ధరల వ్యత్యాసాన్ని తగ్గించి వినియోగదారులను కొత్త మోడళ్ల వైపు మళ్లించే వ్యూహంలో భాగంగానే యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. యాపిల్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.