Yograj Singh: ఆటగాళ్ల రిటైర్మెంట్‌కు భార్యలే కారణం.. యోగరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!
భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. కొంతమంది క్రికెటర్ల రిటైర్మెంట్‌పై మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆటగాళ్లు రిటైర్మెంట్ తీసుకోవడానికి వారి భార్యలు, కుటుంబ సభ్యులే ప్రధాన కారణమని, ఫిట్‌నెస్‌కు దీనికి ఏమాత్రం సంబంధం లేదని సింగ్ అన్నాడు.
ఇన్‌సైడ్‌స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ మాట్లాడుతూ.. "ఆటగాళ్ల కెరీర్‌కు మహిళలు అడ్డురాకూడదు. ఇంట్లోని మహిళలు, భార్యలు వారికి కోచింగ్ ఇవ్వడం మొదలుపెడతారు. రిటైర్ అవ్వమని, కుటుంబాన్ని, పిల్లల్ని చూసుకోమని సలహాలిస్తుంటారు. అందుకే ఆటగాళ్లు కెరీర్‌ను మధ్యలోనే ముగిస్తున్నారు. భారత్‌లో 40 ఏళ్లు రాగానే వయసైపోయిందంటారు. 30 ఏళ్లకే మహిళలు తమ ఆకృతి కోల్పోతారు. పిల్లలు పెద్దవాళ్లయ్యారని, ఇక మేమేం చేయగలమని అంటారు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.