Gas Cylinder Shortage: షేక్‌పేటలో గ్యాస్ సిలిండర్ల కోసం ‘యుద్ధం’.. డెలివరీ ఆటోపై ఎగబడ్డ జనం.. వీడియో ఇదిగో!
హైదరాబాద్ నగరంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర రూపం దాల్చింది. సరఫరాలో జాప్యం కారణంగా విసిగిపోయిన వినియోగదారులు ఏకంగా డెలివరీ ఆటోను అడ్డుకుని సిలిండర్ల కోసం ఎగబడ్డారు. షేక్‌పేట జంక్షన్ సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి లోడ్‌తో వస్తున్న డెలివరీ ఆటోను స్థానికులు చుట్టుముట్టారు. గ్యాస్ బుక్ చేసి వారం రోజులు దాటినా సిలిండర్లు రావడం లేదని, ఏజెన్సీ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటోలో ఉన్న సిలిండర్లను బలవంతంగా దించుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడ కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
వెంటనే స్పందించిన గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది, కొందరు స్థానికులు వినియోగదారులను వారించారు. నిబంధనల ప్రకారం డెలివరీ చేయాల్సి ఉంటుందని, ఇలా చేయడం సరికాదని సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.
గత కొన్ని రోజులుగా నగరంలోని చాలా ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సకాలంలో గ్యాస్ అందక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని గ్యాస్ పంపిణీ వ్యవస్థను క్రమబద్ధీకరించాలని నగరవాసులు కోరుతున్నారు.