Jag Vasanti: గుజరాత్ తీరానికి 'జగ్ వసంత్'.. 42 వేల టన్నుల గ్యాస్‌తో రాక

Jag Vasanti arrives at Gujarat coast with 42000 tons of gas
షార్ట్స్‌లో చూడండి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్‌కు మరో ఎల్‌పీజీ ట్యాంకర్ సురక్షితంగా చేరుకుంది. 'జగ్ వసంత్' అనే పేరు గల ఈ నౌక, 42,000 టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG)తో శుక్రవారం గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకు వచ్చింది. హర్మూజ్ జలసంధి మూసివేత భయాల నడుమ ఈ నౌక తన ప్రయాణ మార్గంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం.

సోమవారం 'పైన్ గ్యాస్' అనే మరో ట్యాంకర్‌తో కలిసి ప్రయాణం ప్రారంభించిన 'జగ్ వసంత్'.. సంప్రదాయ మార్గానికి బదులుగా ఖేష్మ్-లారక్ ఛానెల్ ద్వారా హర్మూజ్ జలసంధిని దాటింది. ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు తమను స్పష్టంగా భారతీయ నౌకలుగా గుర్తించేందుకు 'IND SHIP AND CREW', 'JGVASNTINDSHIPINDCRW' వంటి సందేశాలను ప్రసారం చేశాయి. ఇరాన్ అధికారుల నుంచి ముందస్తు అనుమతితోనే ఈ నౌకలు ఇలా ప్రయాణించి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఇటీవలి కాలంలో భారత్‌కు సురక్షితంగా చేరుకున్న మూడో ఎల్‌పీజీ ట్యాంకర్ ఇది. ఇప్పటికే 'శివాలిక్', 'నందా దేవి' అనే మరో రెండు నౌకలు గుజరాత్‌లోని ముంద్రా, వాడినార్ ఓడరేవులకు చేరుకున్నాయి. ఆ రెండు నౌకలు కలిపి 92,000 టన్నులకు పైగా ఎల్‌పీజీని తీసుకొచ్చాయి. 'జగ్ వసంత్' హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటిందని నౌకాయాన మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా ముందే వెల్లడించారు. ప్రస్తుతం కాండ్లా పోర్టుకు చేరిన ఈ నౌక నుంచి ఎల్‌పీజీ బదిలీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.
Go Back to Shorts
Jag Vasanti
LPG Tanker
Gujarat
Kandla Port
Hormuz Strait
Pine Gas
Shipping
India LPG Import
Oil and Gas
West Asia Tensions

More Telugu News