Advertisement

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ తప్ప ఏదీ అమలు చేయలేదు: బీజేపీ

Ramachander Rao Slams Congress for Unfulfilled Promises Except Free Bus Travel
  • అన్ని గ్యారెంటీలను ప్రభుత్వం పక్కన పెట్టిందని విమర్శలు
  • హామీలను అమలు చేసినట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
  • ఎన్నికల హామీలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీజేపీ ఆందోళన
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ తప్ప ఏ హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. మిగతా అన్ని గ్యారెంటీలను పక్కన పెట్టి, వాటిని అమలు చేసినట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ, ఆరు గ్యారెంటీల్లో ప్రజలకు ఒక్కటి కూడా చేరడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా కింద ఇంకా ఎకరానికి రూ.45 వేల కోట్ల బకాయిలు చెల్లించవలసి ఉందని అన్నారు. దాదాపు రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. దీంతో విద్యాసంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement
Ramachander Rao
Telangana BJP
Congress government
Free bus travel
Election promises
Rythu Bharosa

More Telugu News