Telangana Fuel Crisis: హైదరాబాద్ సహా తెలంగాణలో పలుచోట్ల పెట్రోల్ బంకులు మూత!

Petrol Pumps Shut Down in Hyderabad
షార్ట్స్‌లో చూడండి
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం నేపథ్యంలో మన దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ తదితరాలపై భారీ ప్రభావం పడుతోంది. హైదరాబాద్‌లో ఇంధన కొరత కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న పెట్రోల్ బంకులు తాత్కాలికంగా మూతబడ్డాయి. ముఖ్యంగా ప్రధాన కూడళ్లలోని బంకులు వరుసగా మూతబడుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది.

సోమాజిగూడ, ఎస్సార్ నగర్ తదితర ప్రాంతాల్లోని పెట్రోలు బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ పలు పెట్రోల్ బంకులు తాత్కాలికంగా తెరుచుకోవడం లేదు. తెరిచి ఉన్న బంకుల్లో వాహనదారులు బారులు తీరుతున్నారు.

యుద్ధానికి ముందు చమురు రంగ కంపెనీలు క్రెడిట్ ఇచ్చేవని, కానీ ఇటీవల ఇవ్వడం లేదని పెట్రోల్ బంకుల యజమానులు చెబుతున్నారు. కొత్తగా పెట్రోల్, డీజిల్ స్టాక్ కావాలంటే అడ్వాన్స్ కడితేనే వస్తుందని చెబుతున్నారు. కాగా, ఇరాన్‌తో యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరాన్ కూడా ట్రంప్ ప్రకటనకు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది.
Go Back to Shorts
Telangana Fuel Crisis
Hyderabad Petrol Shortage
Petrol Price Hike
Fuel Supply Interruption
Iran Israel Conflict Impact
Donald Trump Iran
Petrol Pumps Closed
Diesel Shortage India

More Telugu News