పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సినీ నటి పూర్ణ

Actress Poorna Welcomes Baby Girl
  • తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ
  • ఈ చిన్నారి తమకు అపురూపమైన కానుక అన్న నటి
  • 2022లో దుబాయ్ వ్యాపారవేత్తను పెళ్లాడిన పూర్ణ

టాలీవుడ్ నటి, ‘ఢీ’ ఫేమ్ పూర్ణ (షామ్నా ఖాసిమ్) తన అభిమానులతో ఒక సంతోషకరమైన వార్తను పంచుకున్నారు. ఆమె రెండోసారి తల్లి అయ్యారు. ఈ ఉదయం 4.25 గంటలకు ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రకటించారు. తన జీవితంలోకి వచ్చిన ఈ చిన్నారి అపురూపమైన కానుక అని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా డెలివరీ సాఫీగా జరిగినందుకు దేవుడికి, ఆసుపత్రి సిబ్బందికి పూర్ణ తన కృతజ్ఞతలు తెలిపారు.


పూర్ణకు 2022లో దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ అలీతో వివాహం జరిగింది. వీరికి 2023లో బాబు హమ్దాన్‌ జన్మించాడు. ఇప్పుడు మరోసారి తల్లి అయినట్టు పూర్ణ తీపి కబురు అందించారు. ఈ సందర్భంగా సినీ తారలు, అభిమానులు పూర్ణ దంపతులకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.

Go Back to Shorts
Poorna
Poorna actress
Poorna baby girl
Poorna second child
Shanid Asif Ali
Tollywood actress
Dhee fame Poorna
actress Poorna
newborn baby
celebrity baby

More Telugu News