SVSN Varma: పిఠాపురంలో ఫ్లెక్సీ చిచ్చు... సీఎం ఫోటో చిన్నదిగా ఉండటంపై వర్మ ఆగ్రహం
సీఎం చంద్రబాబుకు అవమానం జరిగిందంటూ టీడీపీ నేత, పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో చిన్నదిగా ఉందంటూ, వర్మ తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు.
పిఠాపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల కోసం ఒక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్మ, వేదికపై ఉన్న ఫ్లెక్సీని గమనించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు చిత్రాన్ని చిన్నదిగా ముద్రించి అవమానించారని ఆయన ఆరోపించారు. "ముఖ్యమంత్రికి గౌరవం లేని చోట నేను కూర్చోలేను" అని మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వేదిక ఎక్కకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు. బయటికి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులపై వర్మ మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఫొటో గురించి ముందే చూసుకోవాలి కదా... పార్టీలో ఉంటూ ఏం చేస్తున్నారు? అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడి ఫొటో రెవెన్యూ స్టాంప్ అంత చిన్నదిగా వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పార్టీలకు అతీతంగా అందరూ గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మొన్న సంక్రాంతి సంబరాల్లోనూ ఇలాగే జరిగిందని అన్నారు. దాదాపు ఐదారుసార్లు ఇటువంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఇవాళ పారిశుద్ధ్య కార్మికుల శిక్షణ కార్యక్రమంలో తాను వేదిక ఎక్కినా, కార్యకర్తలు ఊరుకోలేదని వర్మ వెల్లడించారు.