Donald Trump: వారిని అంతం చేస్తున్నా: ఇరాన్‌కు మరోసారి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

Donald Trump warns Iran as president he is ending them
  • ఇప్పటికే ఇరాన్ నౌకాదళం కనుమరుగైందన్న ట్రంప్
  • వైమానికదళం కూడా ఉండబోదని హెచ్చరిక
  • క్షిపణులు, డ్రోన్లు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయన్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా వారిని అంతం చేస్తున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. మతిచెడిన నేతలకు ఈరోజు ఏం జరుగుతుందో మీరే చూస్తారని అన్నారు. ఇరాన్ నౌకాదళం ఇప్పటికే కనుమరుగయ్యిందని, ఇక వైమానిక దళం కూడా ఉండదని హెచ్చరించారు. క్షిపణులు, డ్రోన్లు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయని ఆయన అన్నారు.

ఇప్పటికే వారి నాయకులు తుడిచిపెట్టుకుపోయారని అన్నారు. అక్కడి పాలకులు 47 ఏళ్ళుగా అమాయకులను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. అందుకే అగ్రరాజ్యం అధ్యక్షుడిగా వారి అంతు చూస్తున్నానని ట్రంప్ అన్నారు. 

ఇదిలా ఉండగా, అమెరికాకు చెందిన రీఫ్యూయలింగ్ విమానం కేసీ-135 ట్యాంకర్ ఉత్తర ఇరాక్‌లో కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం సమయంలో విమానంలో ఆరుగురు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఘటనకు దారి తీసిన చర్యలపై దర్యాప్తు చేస్తున్నామని అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ తెలిపింది.
Donald Trump
Iran
US Iran relations
Iran military
Trump Iran warning
Middle East tensions
G7 Summit

More Telugu News