Manushree: హైదరాబాద్‌లో కర్ణాటక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య!
- కొండాపూర్ సుమధుర అపార్ట్‌మెంట్‌లో ఘటన
- ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న మనుశ్రీ
- పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య
పని ఒత్తిడి తట్టుకోలేక హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని కొండాపూర్ సుమధుర అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న 32 ఏళ్ల మనుశ్రీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గచ్చిబౌలి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.
పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మనుశ్రీ కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువతి. నిన్న రాత్రి నుంచి ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తల్లిదండ్రులు పక్క గదిలో ఉంటున్న యువతికి ఫోన్ చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పక్క గదిలో ఉంటున్న యువతి వచ్చి గది తలుపులు తీయడంతో ఫ్యానుకు ఉరివేసుకుని వికతజీవిగా కనిపించింది. అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ సిబ్బంది గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.