పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్

  • కొన్నేళ్లేగా ఒక యువతితో ప్రేమలో ఉన్న బెల్లంకొండ
  • ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఒక్కటి కాబోతున్న జంట
  • వధువు వివరాలను గోప్యంగా ఉంచిన వైనం

యాక్షన్ చిత్రాలతో వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ నెల మార్చి 8న ఆయన నిశ్చితార్థ వేడుక జరగనుంది. గత కొన్నేళ్లుగా ఒక యువతితో ప్రేమలో ఉన్న శ్రీనివాస్, ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో తన స్నేహితురాలిని పెళ్లాడబోతున్నాడు.


ఈ వేడుకను అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా ప్రైవేట్‌గా నిర్వహించనున్నట్టు సమాచారం. వధువు వివరాలను ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో బెల్లంకొండ అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.



More Telugu News