ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ టీమ్ కు కొత్త కెప్టెన్.. రషీద్ ఖాన్ కెప్టెన్సీపై వేటు
- టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ దశలోనే వెనుదిరిగిన ఆఫ్ఘనిస్థాన్
- ఇబ్రహీం జాద్రాన్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన ఆఫ్ఘన్ బోర్డు
- మూడు ఫార్మాట్లలోనూ రాణించిన జద్రాన్
టీ20 ప్రపంచకప్‌లో జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి, ఆ బాధ్యతలను యువ ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్‌కు అప్పగించింది. ముఖ్యంగా గ్రూప్ దశలోనే ఆఫ్ఘన్ జట్టు వెనుదిరగడంతో ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
24 ఏళ్ల వయస్సులోనే జట్టు పగ్గాలు చేపట్టిన ఇబ్రహీం జాద్రాన్, ఇప్పుడు ఆఫ్ఘన్ క్రికెట్‌ను మళ్లీ విజయపథంలోకి తీసుకెళ్లాల్సిన గురుతర బాధ్యతను మోయాల్సి ఉంది. మూడు ఫార్మాట్లలోనూ ఇబ్రహీం గణాంకాలు చాలా ఆకట్టుకునేలా ఉన్నాయి. టీ20ల్లో 65 మ్యాచుల్లో 1,865 పరుగులు సాధించాడు. 39 వన్డేల్లో 1,869 పరుగులు... 8 టెస్టు మ్యాచుల్లో 602 రన్స్ చేశాడు.