సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి సందడి.. హాజరైన లోకేశ్‌ దంపతులు

  • సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహ వేడుక
  • ముంబయిలో జరిగిన పెళ్లికి హాజరైన లోకేశ్‌, బ్రహ్మణి
  • అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్‌ల వివాహం
  • నూతన వధూవరులను ఆశీర్వదించిన లోకేశ్‌ దంపతులు
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకకు ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన అర్ధాంగి బ్రహ్మణితో కలిసి హాజరయ్యారు. ఇవాళ‌ ఉదయం ముంబయిలో ఈ వేడుక జరిగింది.

ముంబయిలోని ప్రఖ్యాత సెయింట్ రెజిస్ హోటల్‌లో అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్‌ల వివాహం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన లోకేశ్‌, బ్రహ్మణి దంపతులకు సచిన్ టెండూల్కర్ కుటుంబం సాదరంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా నూతన వధూవరులను లోకేశ్‌ దంపతులు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వివాహ మహోత్సవానికి దేశంలోని క్రీడా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.



More Telugu News