అమెరికాతో ఒప్పందం ఎఫెక్ట్.. 48 గంటల్లో 15 లక్షల మంది యూజర్లను కోల్పోయిన ఓపెన్ఏఐ

OpenAI Loses 15 Million Users After US Deal
  • అమెరికా రక్షణ శాఖలో తమ ఏఐ మోడల్స్ వినియోగానికి ఓపెన్ఏఐ ఒప్పందం
  • మిలిటరీ ఆపరేషన్‌లలో ఏఐ వినియోగం పట్ల యూజర్ల తీవ్ర అసంతృప్తి
  • 48 గంటల్లో చాట్‌జీపీటీ నుంచి వైదొలిగిన 15 లక్షల మంది వినియోగదారులు
సామ్ ఆల్ట్ మన్ నేతృత్వంలోని ఓపెన్ఏఐ తన ఏఐ మోడళ్లను ఉపయోగించుకోవడానికి అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌కు  అనుమతించడంతో ఆ సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా రక్షణ శాఖలో తమ ఏఐ మోడల్స్ వినియోగానికి ఓపెన్ఏఐ పెంటగాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కుదిరిన 48 గంటల్లో ఆ సంస్థకు చెందిన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీజీ నుంచి 15 లక్షల మంది వినియోగదారులు వైదొలిగారు.

అయితే ఇందుకు సంబంధించి సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మిలటరీ ఆపరేషన్‌లలో ఏఐ వినియోగానికి మద్దతు ఇవ్వడం పట్ల యూజర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ఏఐని వీడటంతో పాటు కొంతమంది సబ్‌స్క్రిప్షన్ రద్దు చేసుకుంటున్నారు. ఈ దెబ్బతో యాప్ స్టోర్ ర్యాంకింగ్‌లో చాట్‌జీపీటీని ఆంథ్రోపిక్స్ క్లాడ్ అధిగమించింది.

మొదట ఆంథ్రోపిక్ క్లాడ్ మోడల్స్‌ను తమ సైన్యం అపరిమితంగా ఉపయోగించుకునేలా యాక్సెస్ ఇవ్వాలని పెంటగాన్ డిమాండ్ చేసింది. ఈ చర్య ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధమని ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడెయ్ తిరస్కరించారు. తమకు యాక్సెస్ ఇవ్వని ఆంథ్రోపిక్‌తో వ్యాపారం చేయబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో ఆంథ్రోపిక్ ప్రత్యర్థి సంస్థ ఓపెన్ఏఐతో పెంటగాన్ ఒప్పందం కుదుర్చుకుంది.
Go Back to Shorts
OpenAI
Sam Altman
ChatGPT
Pentagon
US Department of Defense
Anthropic
Claude
Dario Amodei

More Telugu News