Majid Ebnelreza: యుద్ధం వేళ, ఇరాన్ తాత్కాలిక రక్షణ మంత్రిగా మాజిద్ నియామకం

Majid Appointed Irans New Defense Minister Amid Conflict
  • ఇజ్రాయెల్, అమెరికా దాడిలో మృతి చెందిన రక్షణ మంత్రి అమీర్
  • తాత్కాలికంగా మాజిద్ ఎబ్‌నెల్‌రెజాకు బాధ్యతలు అప్పగించిన ఇరాన్
  • ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌లో జనరల్‌గా ఉన్న మాజిద్
ఇరాన్ తాత్కాలిక రక్షణ మంత్రిగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌జనరల్‌గా ఉన్న మాజిద్ ఎబ్‌నెల్‌రెజా నియమితులయ్యారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ నిర్ణయం మేరకు మాజిద్‌ను రక్షణ మంత్రిగా నియమించినట్లు ఇరాన్ అధ్యక్షుడి ప్రతినిధి 'ఎక్స్' వేదికగా ప్రకటించారు.

మూడు రోజులుగా అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇరాన్ గల్ఫ్ దేశాలలోని అమెరికా స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుంది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదే, ఇతర ముఖ్య నాయకులు మృతి చెందారు. రక్షణ మంత్రి మృతి చెందిన నేపథ్యంలో తాత్కాలికంగా ఆ బాధ్యతలను మాజిద్‌కు అప్పగించారు.

అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్‌లో 555 మంది మృతి చెందగా, 700 మందికి పైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్‌లోనూ పలువురు మృతి చెందారు.
Majid Ebnelreza
Iran
Defense Minister
Islamic Revolutionary Guard Corps
Masoud Pezeshkian

More Telugu News