Revanth Reddy: మక్కా యాత్ర బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత

Revanth Reddy Distributes Compensation to Mecca Bus Accident Victims Families
  • గత ఏడాది నవంబర్‌లో మృతి చెందిన 44 మంది
  • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేత
  • గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున అందజేత
గత సంవత్సరం నవంబర్‌లో మక్కా యాత్రలో జరిగిన బస్సు ప్రమాదంలో 44 మంది హైదరాబాద్ వాసులు సజీవ దహనమైన విషయం తెలిసిందే. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిహారం పంపిణీ చేశారు. 44 మంది మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం పంపిణీ చేశారు. ఈ బస్సు ప్రమాదంలో గాయపడినవారికి రూ.3 లక్షల చొప్పున సాయం అందించారు.

గత సంవత్సరం నవంబర్ 17న మక్కా యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మక్కా నుంచి బయలుదేరిన బస్సు ముందు వెళుతున్న డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది.
Revanth Reddy
Mecca Pilgrimage
Telangana
Hyderabad
Bus Accident
Compensation
Saudi Arabia

More Telugu News