ట్రంప్ కొత్త సుంకాల అమలుపై సందిగ్ధత

Uncertainty Over Trumps New Tariffs Implementation
షార్ట్స్‌లో చూడండి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల ఉత్పత్తులపై విధించిన వివాదాస్పద టారిఫ్‌ ల (సుంకాలు)కు బ్రేక్ పడింది. ట్రంప్ నిర్ణయాలు చట్టవిరుద్ధమని ఆ దేశ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడంతో రేపటి (మంగళవారం) నుంచి ఆ వసూళ్లను నిలిపివేస్తున్నట్లు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం అధికారికంగా ప్రకటించింది.

రేపటి నుంచే నిలిపివేత..
‘అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం’ (ఐఈఈపీఏ) కింద ఇప్పటివరకు వసూలు చేస్తున్న టారిఫ్‌లను అమెరికా కాలమానం ప్రకారం ఫిబ్రవరి 24వ తేదీ అర్ధరాత్రి 12:01 గంటల నుంచి నిలిపివేస్తారు. ఈ పరిణామంతో భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు 15 శాతానికి తగ్గే అవకాశం ఉంది. ఇది భారతీయ ఎగుమతిదారులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. ఇప్పటివరకు దిగుమతిదారులు చెల్లించిన వేల కోట్ల టారిఫ్ సొమ్మును తిరిగి చెల్లిస్తారా (రిఫండ్) లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

ట్రంప్ పంతం.. 
సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టిన ట్రంప్.. ఎలాగైనా 15 శాతం సుంకాలు అమలు చేస్తానని మళ్ళీ ప్రకటించారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ‘ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్’ ఇంకా వెలువడకపోవడంతో కొత్త టారిఫ్‌లు రేపటి నుంచి అమలవుతాయా లేదా అన్నది సందిగ్ధంలో పడింది.
Go Back to Shorts
Donald Trump
US Tariffs
America Tariffs
Import Tariffs
Supreme Court Ruling
International Emergency Economic Powers Act
Indian Exports
US Customs and Border Protection
Trade
Tariff Refund

More Telugu News