Revanth Reddy: హైకోర్టులో రేవంత్ రెడ్డి క్వాష్ పిటిషన్‌పై విచారణ

Revanth Reddy Quash Petition Hearing in High Court
షార్ట్స్‌లో చూడండి
తనపై భూపాలపల్లి, మొగులపల్లి పోలీస్ స్టేషన్‌లలో నమోదైన కేసులు కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచార సభలలో తనపై నిరాధార, అనుచిత ఆరోపణలు చేశారంటూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఫిర్యాదు చేయడంతో రేవంత్ రెడ్డిపై రెండు కేసులు నమోదయ్యాయి.

భూపాలపల్లి, మొగులపల్లి పోలీస్ స్టేషన్‌లలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ ముఖ్యమంత్రి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం కోర్టులో హాజరునుంచి ముఖ్యమంత్రికి మినహాయింపు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయడానికి గండ్ర వెంకటరమణారెడ్డి న్యాయవాది సమయం కోరడంతో తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.
Go Back to Shorts
Revanth Reddy
Telangana CM
Gandra Venkata Ramana Reddy
High Court
Quash Petition
Bhupalpally

More Telugu News