Droupadi Murmu: విశాఖ తీరంలో నౌకాదళ విన్యాసాలు.. ఐఎన్‌ఎస్‌ సుమేధపై రాష్ట్రపతి, సీఎం ప్రయాణం

విశాఖ తీరంలో ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్ఆర్) వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో పాటు ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా నౌకాదళ సిబ్బంది నుంచి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆమె ఐఎన్‌ఎస్‌ సుమేధ యుద్ధ నౌకలో ప్రయాణించారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. సముద్ర అలలపై వరుసగా నిలిచిన యుద్ధ నౌకలను వారు వీక్షించారు.

71 యుద్ధ నౌకల విన్యాసాలు..
ఈ ఫ్లీట్ రివ్యూలో భారత నావికాదళ సత్తాతో పాటు ప్రపంచ దేశాల నౌకలు కూడా కదం తొక్కాయి. ఆరు వరుసల్లో మొత్తం 71 యుద్ధ నౌకలు పరేడ్‌ నిర్వహించాయి. భారత నేవీకి చెందిన 45 నౌకలతో పాటు కోస్ట్‌గార్డ్, మర్చంట్‌ నేవీ మరియు పరిశోధన నౌకలు ఇందులో పాల్గొన్నాయి. రష్యా, ఆస్ట్రేలియా, యూఏఈ వంటి వివిధ దేశాల నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విశాఖ సముద్ర తీరం యుద్ధ నౌకల గర్జనలు, నావికాదళ విన్యాసాలతో సందడిగా మారింది. దేశ రక్షణలో నౌకాదళం పోషిస్తున్న కీలక పాత్రను ఈ వేడుక ప్రతిబింబించింది.
Droupadi Murmu
Visakhapatnam
International Fleet Review
Indian Navy
Naval Exercises
Chandrababu Naidu
Pawan Kalyan
INS Sumedha
Andhra Pradesh

More Telugu News