Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రెండో పాట విడుదలకు ముహూర్తం ఖరారు

ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్‌పై అభిమానుల్లో అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి 26న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన తొలి పాట ‘దేఖ్లేంగే సాలా’ ఫ్యాన్స్‌ను ఫిదా చేయగా.. ఇప్పుడు రెండో సింగిల్ విడుదలకు చిత్రబృందం సిద్ధమైంది.
 
ఆరా ఆఫ్ ఉస్తాద్ పేరుతో రానున్న ఈ పవర్‌ఫుల్ యాంథమ్‌ను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా తాజాగా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా మిక్స్‌తో ఈ చిత్రం భారీ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

తాజా పోస్టర్‌లో పవన్ కల్యాణ్ ఎదుట భారీ జనసముద్రం కనిపించడం ఆకట్టుకుంటుండగా.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ -హరీష్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటం, పైగా డీఎస్పీ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Pawan Kalyan
Ustaad Bhagat Singh
Harish Shankar
Sreeleela
Raashi Khanna
Mythri Movie Makers
Deekhlege Salaa
Aura of Ustaad
DSP
Telugu Movie

More Telugu News