అమెరికాలో అదృశ్యమైన భారత విద్యార్థి సాకేత్ మృతి.. ధ్రువీకరించిన కాన్సులేట్

National
Advertisement
  • యూసీ బర్కిలీలో మాస్టర్స్ చేస్తున్న 22 ఏళ్ల సాకేత్
  • మరణాన్ని ధ్రువీకరించిన శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్
  • ఈ నెల 12 నుంచి అదృశ్యమైనట్లుగా కేసు నమోదు
  • మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు
Advertisement
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన మరో భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కాలిఫోర్నియాలోని బర్కిలీలో కొద్దిరోజుల క్రితం అదృశ్యమైన సాకేత్ శ్రీనివాసయ్య (22) మరణించినట్లు శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయం ఆదివారం ధ్రువీకరించింది.

ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం నుంచి సాకేత్ కనిపించడం లేదంటూ ఫిర్యాదులు అందాయి. దీంతో స్థానిక పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే సాకేత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కాన్సులేట్ తన ప్రకటనలో తెలిపింది. సాకేత్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (యూసీ), బర్కిలీలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. గతంలో ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ పూర్తి చేశాడు.

"స్థానిక పోలీసులు భారత విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ధ్రువీకరించారని తెలియజేయడానికి చింతిస్తున్నాము. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, ప్రియమైన వారికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము" అని కాన్సులేట్ కార్యాలయం 'ఎక్స్' వేదికగా పేర్కొంది. మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని, కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేసింది.

పోలీసుల నివేదికల ప్రకారం సాకేత్‌ను చివరిసారిగా లేక్ అంజా సమీపంలో చూశారు. గాలింపు చర్యల అనంతరం అక్కడే అతడి మృతదేహం లభించినట్లు తెలిసింది. అతడి అదృశ్యం వెనుక గల కారణాలపై పోలీసులు స్పష్టత ఇవ్వనప్పటికీ, అతడు 'రిస్క్'లో ఉన్నట్లుగా భావించి గాలింపు చేపట్టారు. మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
Advertisement

సంబంధిత వార్తలు

Saket SrinivasIndian student deathCalifornia BerkeleyUniversity of California Berkeleymissing studentLake AnzaIIT Madraschemical engineeringIndian consulatestudent death America

More Telugu News

ఒకవైపు కిడ్నీ ఫెయిల్యూర్.. మరోవైపు రూ.130 కోట్ల ఫండింగ్! క్యాష్‌కరో వ్యవస్థాపకురాలి స్ఫూర్తి ప్రస్థానం

06 Nov, 09:44

గిల్ సెంచరీ చేస్తే ఇప్పటికీ నన్నే తిడతారు.. వెంకటేష్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు!

06 Nov, 09:37

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. జంటగా అభిషేక్‌-ఐశ్వర్య.. విడాకుల ప్రచారానికి తెర

06 Nov, 09:26

అండర్-19 ఆసియా కప్: నేపాల్‌తో భారత్ తొలి పోరు.. అందరి కళ్లు సెహ్వాగ్, ద్రావిడ్ వారసులపైనే!

06 Nov, 09:20

'రామాయణ' ఫస్ట్ డే కలెక్షన్స్.. భారీ ఓపెనింగ్స్ కానీ అంచనాలు మిస్!

06 Nov, 09:17

కేరళం నుంచి అమెరికా వరకు.. లాస్‌ఏంజెల్స్‌ మేయర్‌గా భారతీయ మహిళ!

06 Nov, 09:10

మా ‘లడ్డూ’ను వెతికి పెడితే రూ.లక్ష రివార్డు ఇస్తాం.. పెంపుడు చిలుక కోసం యజమానుల విన్నపం

06 Nov, 08:56

భారతీయుల్లోనే ప్రత్యేక గుండెజబ్బు.. కారణాలను కనుగొన్న హైదరాబాద్ శాస్త్రవేత్తలు

06 Nov, 08:55

భారత్ అమ్ములపొదిలో మరో అస్త్రం.. 'ప్రళయ్' పరీక్ష సక్సెస్

06 Nov, 08:41

ట్రంప్ హెచ్చరికల వేళ.. అమెరికాకు 7 షరతులతో ఇరాన్ ప్రతిపాదన!

06 Nov, 08:40

అంతర్జాతీయ ఎమ్మీ వేదికపై విజయ్ సేతుపతి.. తొలి భారతీయ నటుడిగా అరుదైన ఘనత

06 Nov, 08:26

ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్: రంగంలోకి ఈడీ.. ఏకకాలంలో ఏడు చోట్ల సోదాలు

06 Nov, 08:09

‘మురసు’ పెను విలయం: ఏపీలో 8 మంది బలి, రూ.1918 కోట్ల నష్టం

06 Nov, 08:01

ఐపీఎల్‌లో సరికొత్త సంచలనం.. రిటెన్షన్‌కు 40 కోట్లు డిమాండ్ చేస్తున్న స్టార్స్!

06 Nov, 07:49

ఏఐ దెబ్బ.. స్మార్ట్‌ఫోన్ల ధరలకు రెక్కలు! సామాన్యులపై భారీ భారం

06 Nov, 07:25
..More Telugu News