నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లను మేమే కైవసం చేసుకుంటాం: మహేశ్ కుమార్ గౌడ్

Telangana
Advertisement
  • కొత్తగూడెం కార్పొరేషన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్న మహేశ్ గౌడ్
  • ఈ ఎన్నికలు కవితకు సంతోషాన్ని ఇచ్చి ఉంటాయని వ్యాఖ్య
  • రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభావం ఉండదన్న పీసీసీ ప్రెసిడెంట్
Advertisement
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంతృప్తిని వ్యక్తం చేశారు. నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లను కూడా తామే కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈరోజు సమావేశమవుతానని... ఈ భేటీలో కార్పొరేషన్లపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.   

ఈ ఎన్నికలు కల్వకుంట్ల కవితకు సంతోషాన్ని ఇచ్చి ఉండవచ్చని మహేశ్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు పతనమవుతోందని... రాబోయే రోజుల్లో ఆ పార్టీ ప్రభావం ఉండదని చెప్పారు. మతాన్ని రెచ్చగొట్టినా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఏమీ సాధించలేకపోయిందని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, ఈ ఎన్నికల ఫలితాలతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన పట్టును మరింత పెంచుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Mahesh Kumar GoudNizamabadKarimnagarCongress PartyRevanth ReddyBRS PartyMunicipal ElectionsTelangana PoliticsK KavithaGHMC Elections

More Telugu News

భారత్‌లో విదేశీయులకు పాస్‌పోర్ట్, వీసా నిబంధనలు సడలింపు.. కేంద్రం కీలక ఉత్తర్వులు

06 Nov, 10:33

విజయవాడలో కృష్ణా నదిపై మరో రైల్వే వంతెన.. రూ.5,858 కోట్ల ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధం

06 Nov, 10:22

ఇంగ్లండ్ ఆఫర్‌ను కాదని.. ఆస్ట్రేలియా జట్టుతో చేరిన 'మిస్టర్ క్రికెట్'

06 Nov, 10:21

30 నిమిషాల్లోనే ప్రభావం.. అందుబాటులోకి రానున్న పురుషుల గర్భనిరోధక మాత్ర!

06 Nov, 10:19

2020 తర్వాత ఇదే అతిపెద్ద పతనం.. కుప్పకూలిన అమెరికా మార్కెట్లు.. కారణాలివే..!

06 Nov, 10:15

హైదరాబాదీలకు దీపావళి కానుక.. భారీగా తగ్గిన మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ ధరలు

06 Nov, 10:10

17 ఏళ్ల కుర్రాడి అద్భుతం.. సామాన్యుడి కోసం సోలార్ వాహనం!

06 Nov, 10:08

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్

06 Nov, 10:01

ఏపీ పరిషత్ ఎన్నికలు: 7 కేంద్రాల్లో కొనసాగుతున్న రీపోలింగ్.. రేపే కౌంటింగ్

06 Nov, 10:00

అమెరికా రాజకీయాల్లో సరికొత్త చరిత్ర.. ఒకే ఎన్నికల్లో 10 సంచలన విజయాలు!

06 Nov, 09:58

ఒకవైపు కిడ్నీ ఫెయిల్యూర్.. మరోవైపు రూ.130 కోట్ల ఫండింగ్! క్యాష్‌కరో వ్యవస్థాపకురాలి స్ఫూర్తి ప్రస్థానం

06 Nov, 09:44

గిల్ సెంచరీ చేస్తే ఇప్పటికీ నన్నే తిడతారు.. వెంకటేష్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు!

06 Nov, 09:37

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. జంటగా అభిషేక్‌-ఐశ్వర్య.. విడాకుల ప్రచారానికి తెర

06 Nov, 09:26

అండర్-19 ఆసియా కప్: నేపాల్‌తో భారత్ తొలి పోరు.. అందరి కళ్లు సెహ్వాగ్, ద్రావిడ్ వారసులపైనే!

06 Nov, 09:20

'రామాయణ' ఫస్ట్ డే కలెక్షన్స్.. భారీ ఓపెనింగ్స్ కానీ అంచనాలు మిస్!

06 Nov, 09:17
..More Telugu News