6 మున్సిపాలిటీల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ... కరీంనగర్, నిజామాబాద్ గెలుస్తున్నాం: రామచందర్ రావు

Telangana
Advertisement
  • ఈ ఎన్నికల్లో బీజేపీ బలపడిందన్న రామచందర్ రావు
  • హంగ్ వచ్చినా బీజేపీ ఎవరికీ మద్దతివ్వదని స్పష్టీకరణ
  • తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా
Advertisement
ఆరు మున్సిపాలిటీల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిందని, రెండు కార్పొరేషన్లు గెలుచుకోబోతున్నామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో బీజేపీ బలపడిందని అన్నారు. ఎక్కువ సీట్లు, ఓట్లు సాధించామని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 250 వార్డుల్లో గెలిచామని పేర్కొన్నారు.

కరీంనగర్, నిజామాబాద్ మున్సిపాలిటీలను కైవసం చేసుకోబోతున్నామని వ్యాఖ్యానించారు. నారాయణపేట, ఆదిలాబాద్, రాయికల్ వంటి మున్సిపాలిటీల్లో బీజేపీ వారే ఛైర్మన్లు అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎక్స్ అఫిషియో, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ఛైర్మన్ పదవులు దక్కించుకుంటామని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తాము ఆశించిన మేర ఉన్నాయని, కొన్ని జిల్లాల్లో మాత్రం ఆశించిన ఫలితాలు రాలేదని అన్నారు.

త్రిముఖ పోరులో బీజేపీకి కొంత నష్టం జరిగిందని రామచందర్ రావు అన్నారు. అనేక చోట్ల హంగ్ వచ్చిందని తెలిపారు. ఇవి కాంగ్రెస్ పార్టీకి సానుకూల ఫలితాలు కావని అభిప్రాయపడ్డారు. బీజేపీని ఓడించడానికి పలు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు కలిసి పనిచేశాయని ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్ అన్ని సీట్లు గెలుచుకోగలిగిందని అన్నారు. హంగ్ వచ్చినా బీజేపీ ఎవరికీ మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు.

హైదరాబాద్ ప్రజలు ఆ మూడు పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉందని రామచందర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీని విశ్వసిస్తున్నారని, తాము కచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాము ఎవరికీ మద్దతు ఇచ్చేది లేదని, తమకు మద్దతు ఇస్తామంటే తీసుకుంటామని స్పష్టం చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

Ramachander RaoBJP TelanganaMunicipal ElectionsKarimnagarNizamabadTelangana Politics

More Telugu News

టీమిండియాలోకి రీఎంట్రీపై మనసులో మాట చెప్పిన పృథ్వీ షా

06 Nov, 11:32

లాస్ ఏంజిల్స్ మేయర్‌గా భారత సంతతి మహిళ.. మన వ్యవస్థపై శశి థరూర్ వ్యాఖ్యలు

06 Nov, 11:20

ట్రావెల్స్‌ వ్యాపారులకు టయోటా గుడ్‌న్యూస్‌.. ఇన్నోవా క్రిస్టా లిమో వచ్చేసింది!

06 Nov, 11:19

కడుపులోకి వెళ్లిన టూత్ బ్రష్.. సర్జరీ లేకుండా బయటకు తీసిన వైద్యులు!

06 Nov, 11:17

కుటుంబంలోని ఏడుగురి హత్య .. భార్యపై కక్షతో రాక్షసుడిగా మారిన క్యాబ్ డ్రైవర్‌

06 Nov, 11:15

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు ముమ్మరం

06 Nov, 10:57

భారత్‌లో విదేశీయులకు పాస్‌పోర్ట్, వీసా నిబంధనలు సడలింపు.. కేంద్రం కీలక ఉత్తర్వులు

06 Nov, 10:33

విజయవాడలో కృష్ణా నదిపై మరో రైల్వే వంతెన.. రూ.5,858 కోట్ల ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధం

06 Nov, 10:22

ఇంగ్లండ్ ఆఫర్‌ను కాదని.. ఆస్ట్రేలియా జట్టుతో చేరిన 'మిస్టర్ క్రికెట్'

06 Nov, 10:21

30 నిమిషాల్లోనే ప్రభావం.. అందుబాటులోకి రానున్న పురుషుల గర్భనిరోధక మాత్ర!

06 Nov, 10:19

2020 తర్వాత ఇదే అతిపెద్ద పతనం.. కుప్పకూలిన అమెరికా మార్కెట్లు.. కారణాలివే..!

06 Nov, 10:15

హైదరాబాదీలకు దీపావళి కానుక.. భారీగా తగ్గిన మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ ధరలు

06 Nov, 10:10

17 ఏళ్ల కుర్రాడి అద్భుతం.. సామాన్యుడి కోసం సోలార్ వాహనం!

06 Nov, 10:08

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్

06 Nov, 10:01

ఏపీ పరిషత్ ఎన్నికలు: 7 కేంద్రాల్లో కొనసాగుతున్న రీపోలింగ్.. రేపే కౌంటింగ్

06 Nov, 10:00
..More Telugu News