ఇండియాను ఓడించడం పాకిస్థాన్ కు ఈజీ కాదు: సౌరభ్ గంగూలీ
- టీ20 వరల్డ్ కప్ లో భారత్ తో ఆడేందుకు రెడీ అయిన పాకిస్థాన్
- పాక్ సరైన నిర్ణయం తీసుకుందన్న సౌరభ్ గంగూలీ
- రాజకీయాలు, క్రీడలు వేరని వ్యాఖ్య
ఐసీసీతో చర్చల గురించి తనకు తెలియదని... కానీ, పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయం మాత్రం సరైనదని గంగూలీ అన్నాడు. భారత్ - పాక్ మ్యాచ్ లు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయని చెప్పాడు. అయితే, కొన్నేళ్లుగా భారత్ కు పాకిస్థాన్ గట్టి పోటీ ఇవ్వలేకపోతోందని అన్నాడు. టీమిండియా అద్భుతమైన జట్టు అని... భారత్ ను ఓడించడం పాక్ కు సులువు కాదని స్పష్టం చేశాడు.