ఎల్బీ నగర్ ఆసుపత్రిలో అర్ధరాత్రి మహిళ హల్ చల్.. డాక్టర్లపై దాడి.. ఇదిగో వీడియో!

Woman creates ruckus at LB Nagar hospital at midnight and attacks doctors video goes viral
  • కడుపునొప్పి అంటూ ఆసుపత్రికి వచ్చిన మహిళ
  • వైద్య పరీక్షలు చేసిన ఆసుపత్రి సిబ్బంది
  • ఎలాంటి సమస్య లేదని చెప్పడంతో డాక్టర్లపై దాడి
  • హాస్పిటల్ సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
  • మరో ఆసుపత్రికి కారులో వెళ్లిపోయిన మహిళ
హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అర్ధరాత్రి సమయంలో ఓ మహిళ హల్ చల్ చేసింది. డాక్టర్లపై దాడికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. లలిత కరీర అనే మహిళ కడుపునొప్పిగా ఉందంటూ నిన్న‌ అర్ధరాత్రి ఎల్బీ నగర్‌లోని శ్రేష్ఠ ఆరెంజ్ హాస్పిటల్ అత్యవసర విభాగానికి వచ్చింది. వైద్యులు ఆమెకు ప్రాథమిక చికిత్స అందించి, పలు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్య లేదని నిర్ధారించి, ఆ విషయాన్ని ఆమెకు తెలియజేశారు.

దీంతో లలిత కరీర ఒక్కసారిగా డాక్టర్లపై తీవ్ర ఆగ్రహానికి గురైంది. వారిని దూషిస్తూ దాడికి పాల్పడింది. అనంతరం తన కారును స్వయంగా నడుపుకుంటూ వనస్థలిపురంలోని సహారా హాస్పిటల్‌కు వెళ్లిపోయింది. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆమె వైద్య సిబ్బందిపై ఎందుకు ఇంత తీవ్రంగా ప్రవర్తించిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
Lalitha Karira
LB Nagar Hospital Attack
Hyderabad Woman Attacks Doctors
Shrestha Orange Hospital LB Nagar
LB Nagar Police Case
Hyderabad Private Hospital Ruckus

More Telugu News