నరవణె పుస్తకం బయటకు ఎలా వచ్చింది?: పెంగ్విన్ సంస్థకు ఢిల్లీ పోలీసుల నోటీసులు
- నరవణె రచించిన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకంపై రాజకీయ దుమారం
- పుస్తకం ప్రచురణ కాకముందే బయటకు రావడంపై ఢిల్లీ పోలీసుల ఆగ్రహం
- నేరపూరిత కుట్రకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు
ఈ పుస్తకం ప్రచురణ కానప్పటికీ రాహుల్ గాంధీ చేతికి ఈ కాపీ ఎలా చేరుకుందని ఇండియా టుడే డిజిటల్ మీడియాలో కథనం వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పుస్తకం లీక్ అయినట్లు పేర్కొంటూ, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ నేరపూరిత కుట్రకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.
ఇంకా ప్రచురితం కాని ఆ పుస్తకానికి సంబంధించి పలు ప్రశ్నలను పోలీసులు సంధించారు. వాటికి పెంగ్విన్ నుండి సమాధానం అడిగారు. ప్రచురణ సంస్థ యాజమాన్యం విచారణలో భాగం కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
ప్రభుత్వం అనుమతి పొందకముందే నరవణె రాసిన ఈ పుస్తకం బయటకు రావడం వివాదంగా మారింది. పుస్తకం ప్రచురితం కాలేదని, మార్కెట్‌లో అందుబాటులో లేదని ప్రచురణ సంస్థ 24 గంటల్లో రెండుసార్లు వివరణ ఇచ్చింది. కానీ లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం ఆ పుస్తకం మార్కెట్‌లో లభ్యమవుతుందని అన్నారు.