తనపై హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసీ ఫిర్యాదు చేయడంపై స్పందించిన అసోం సీఎం హిమంత

National
Advertisement
  • బంగ్లాదేశ్ చొరబాట్లను ఉద్దేశించి చేసిన పోస్టుకు కట్టుబడి ఉన్నానని వ్యాఖ్య
  • తనపై పిర్యాదు చేస్తే అరెస్టుకు కూడా సిద్ధమన్న హిమంత బిశ్వ శర్మ
  • బంగ్లాదేశ్ చొరబాట్ల అంశంపై తన వైఖరి మారదన్న హిమంత బిశ్వ శర్మ
Advertisement
మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనపై హైదరాబాద్ నగర సీపీకి ఫిర్యాదు చేయడంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. తాను బంగ్లాదేశ్ చొరబాట్లను ఉద్దేశించి చేసిన పోస్టుకు కట్టుబడి ఉన్నానని, తనపై ఫిర్యాదు చేస్తే అరెస్టుకు కూడా సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు.

తాను చేసిన పోస్టుకు తనపై చట్టపరమైన చర్యలు తీసుకున్నా ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. "నేను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. నేనేం చేయగలను. నాకు ఏ వీడియో గురించి తెలియదు. అతను (అసదుద్దీన్ ఒవైసీ) నాపై కేసు నమోదు చేసి ఉంటే నన్ను అరెస్టు చేయవచ్చు. నాకేమీ అభ్యంతరం లేదు" అని హిమంత బిశ్వ శర్మ అన్నారు.

తాను చొరబాటు అంశం గురించి స్పందించానని, ఆ విషయంలో తన వైఖరి మారదని స్పష్టం చేశారు. నేను నా మాటకు కట్టుబడి ఉన్నానని అన్నారు. బంగ్లాదేశ్ చొరబాటులను తాను వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు. నేను చొరబాట్లకు వ్యతిరేకంగానే ఉంటానని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో హిమంత బిశ్వ శర్మ చేసిన పోస్టుపై అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Advertisement

సంబంధిత వార్తలు

Asaduddin OwaisiHimanta Biswa SarmaHyderabadAssam CMMajlis PartyBangladesh infiltrators

More Telugu News

పవన్ కల్యాణ్ మాజీ భార్యగానే చూస్తున్నారు: రేణూ దేశాయ్ అసంతృప్తి

06 Nov, 13:34

దీపావళి కానుకలతోనూ కాలుష్యం పెరుగుతోంది.. ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

06 Nov, 13:32

ప్రపంచకప్‌కు ఇది రిహార్సల్.. కివీస్ సిరీస్‌పై కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు

06 Nov, 13:27

ప్రకాశం తీరంలో విషాదం.. తమిళ మత్స్యకారుల మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి

06 Nov, 13:21

5 అడుగుల 3 అంగుళాల గడ్డంతో గిన్నిస్ రికార్డ్.. ఈయన కథే వేరు!

06 Nov, 13:15

ఒక్క ఎకరం అమ్మినట్టు నిరూపించినా ఊడిగం చేస్తా: ప్రభుత్వానికి మాధవరం కృష్ణారావు సవాల్

06 Nov, 13:06

కాంగ్రెస్‌లో అంతర్గత వివాదం.. పిలిచినా రాని మంత్రి? అధిష్ఠానికి పీసీసీ చీఫ్‌ నివేదిక?

06 Nov, 13:05

‘‘రూ.250 కోట్లు ఖర్చు చేశాం.. ఇది మోసం కాదు’’: రూ.85 వేల టెంపుల్‌ గ్యాడ్జెట్‌పై దీపిందర్‌ గోయల్‌!

06 Nov, 12:57

శ్రీరాముడి వనవాసం 14 ఏళ్లే.. నాకు మాత్రం ఇంకా ముగియలేదు: రేణూ దేశాయ్

06 Nov, 12:48

వన్ మినిట్ వీడియోలతో విష ప్రచారం చేస్తున్నారు: బీద రవిచంద్ర

06 Nov, 12:33

బంగారం Vs వెండి Vs గోల్డ్‌ ఈటీఎఫ్‌లు.. ధనత్రయోదశి వేళ ఏది కొనాలి?

06 Nov, 12:30

హైదరాబాద్‌కు రసాయనాలతో తయారు చేసిన కల్తీ పాల సరఫరా.. రంగారెడ్డి జిల్లాలో గుట్టురట్టు!

06 Nov, 12:27

రాముడు, రావణుడి అసలైన వైభవాన్ని, శక్తిని చూడాలంటే తప్పకుండా 'రామాయణ' చూడాలి: సందీప్ వంగా

06 Nov, 12:06

వాట్సాప్‌లో ఇక బ్లూ టిక్స్‌ భయం లేదు.. చాట్‌ ఓపెన్‌ చేయకుండానే మెసేజ్‌లు చదవొచ్చు!

06 Nov, 12:04

పీవీఆర్‌లో మెటా గ్లాసెస్ రగడ.. సిబ్బందితో వ్యక్తి వాదన.. వైరల్ అయిన వీడియో!

06 Nov, 12:02
..More Telugu News