చెన్నైలో పెళ్లి వేడుకకు హాజరైన స్టాలిన్, జగన్, విజయ్

  • చెన్నైలో జరిగిన వివాహ వేడుకలో సందడి
  • పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్న జగన్, విజయ్
  • విజయ్ రాజకీయ ప్రవేశం నేపథ్యంలో పెరిగిన ఆసక్తి
  • 'జన నాయకుడితో జన నాయగన్' అంటూ వైరల్ అవుతున్న ఫొటోలు
రాజకీయ, సినీ రంగాలకు చెందిన ముగ్గురు ప్రముఖులు ఒకే వేడుకలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్, నటుడు-రాజకీయ నేత 'దళపతి' విజయ్ ఆదివారం చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్.. ఇద్దరు అగ్రనేతలతో కలిసి కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

వైసీపీ అధినేత జగన్ బంధువు వై.ఎస్. సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ రెడ్డి వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన స్టాలిన్, జగన్, విజయ్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. జగన్, విజయ్ పక్కపక్కనే కూర్చుని కాసేపు ముచ్చటించుకోవడం కెమెరాల కంటపడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఇటీవలే 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పేరుతో విజయ్ రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మరోవైపు, 'జన నాయగన్' అనే తన సినిమా సెన్సార్ వివాదాలతో వార్తల్లో నిలిచారు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్, స్టాలిన్ వంటి ప్రముఖ నేతలతో విజయ్ కనిపించడం తమిళ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ వివాహ వేడుకకు నటులు సూర్య, కార్తి కూడా హాజరయ్యారు.


More Telugu News