తమిళ హీరో, టీవీకే చీఫ్ విజయ్ కు కోర్టులో చుక్కెదురు
- ట్యాక్స్ పెనాల్టీ రూ.1.5 కోట్లు చెల్లించాల్సిందేనన్ని కోర్టు
- 2015–16 ఏడాది పన్ను చెల్లింపులపై ఐటీ శాఖ ఫైన్
- విజయ్ అప్పీల్ ను తోసిపుచ్చిన మద్రాస్ హైకోర్టు
అప్పట్లో విడుదలైన పులి సినిమాకు తీసుకున్న పారితోషికాన్ని తగ్గించి చూపారని పేర్కొంది. ఆ సినిమాకు రూ.15 కోట్లు పారితోషికంగా విజయ్ అందుకున్నారని, అందులో రూ.5 కోట్లను నగదు రూపంలో తీసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ మొత్తాన్ని లెక్కల్లో చూపకుండా ఆదాయపు పన్ను ఎగ్గొట్టారని ఆరోపించారు. శాఖాపరమైన దర్యాప్తులో ఈ విషయం తేలడంతో విజయ్ కు ఆదాయపు పన్ను శాఖ రూ.1.5 కోట్ల పెనాల్టీ విధించింది.
ఈ పెనాల్టీని రద్దు చేయాలంటూ విజయ్ మద్రాస్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు గత నెల 23న తీర్పు రిజర్వు చేసింది. ఈ రోజు ఉదయం తీర్పు వెలువరిస్తూ.. ఆదాయపు పన్ను శాఖ విధించిన రూ.1.5 కోట్ల పెనాల్టీని చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.