బాక్సింగ్ రింగ్‌లో ఊడిన విగ్గు.. బాక్సర్ ఫన్నీ రియాక్షన్.. ఇదిగో వీడియో!

Sports
Advertisement
  • బాక్సింగ్ ఫైట్‌లో అమెరికన్ బాక్సర్ జారెల్ మిల్లర్‌కు వింత అనుభవం
  • ప్రత్యర్థి పంచ్‌లకు రింగ్‌లోనే ఊడిపోయిన జారెల్ విగ్గు
  • నవ్వుతూ విగ్గును తీసి ప్రేక్షకుల్లోకి విసిరేసిన బాక్సర్
  • అమ్మ షాంపూ వల్లే జుట్టు ఊడిపోయిందని, అందుకే విగ్గు పెట్టానని వెల్లడి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఘటనకు సంబంధించిన వీడియో
Advertisement
అమెరికాలోని ప్రఖ్యాత మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఓ బాక్సింగ్ మ్యాచ్ సందర్భంగా వింత ఘటన చోటుచేసుకుంది. అమెరికన్ బాక్సర్ జారెల్ "బిగ్ బేబీ" మిల్లర్, కింగ్స్లీ ఇబే మధ్య జరిగిన ఫైట్‌లో ఈ సరదా సంఘటన జరిగింది. ప్రత్యర్థి పిడిగుద్దులకు జారెల్ పెట్టుకున్న విగ్గు రింగ్‌లోనే ఊడిపోయింది. ఈ అనూహ్య పరిణామం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.

శనివారం జరిగిన ఈ బౌట్‌లోని రెండో రౌండ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కింగ్స్లీ ఇబే వరుసగా పంచ్‌లు విసరడంతో జారెల్ తలకు పెట్టుకున్న విగ్గు కదిలి, కాసేపటికి పూర్తిగా ఊడి కిందపడిపోయింది. అయితే, ఈ పరిణామానికి జారెల్ ఏమాత్రం చలించకుండా, ఆ విగ్గును తీసి ప్రేక్షకుల పైకి విసిరేశాడు. దీంతో అభిమానులు కేరింతలు కొట్టారు.

మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై జారెల్ స్పందిస్తూ ఓ ఫన్నీ కారణం చెప్పాడు. తన తల్లి వాడిన షాంపూ తను వాడడం వల్లే ఇలా జరిగిందని చెప్పి అందర్నీ నవ్వించాడు. "రెండు రోజుల క్రితం మా అమ్మ ఇంట్లో ఉన్న షాంపూతో తలస్నానం చేశాను. అది అమ్మోనియం బ్లీచ్ లాంటిది కావడంతో నా జుట్టు మొత్తం ఊడిపోయింది. అందుకే వెంటనే నా మేనేజర్‌కు ఫోన్ చేసి ఓ విగ్గు తెప్పించుకుని పెట్టుకున్నాను. నేనో కమెడియన్‌ని, నాపై నేనే జోకులు వేసుకోగలను" అని వివరించాడు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌తో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Viral VideoJarrell MillerJarrell Miller boxingKingsley Ibehboxing wig incidentMadison Square Gardenboxing funny momentsboxing newssports videoboxing humor

More Telugu News

కుర్చీలో ఆర్టీసీ డీఎం, నేలపై కార్మికులు.. మంత్రి పొన్నం సీరియస్!

06 Nov, 19:24

బురదలో, పొలం గట్లపై సీఎం చంద్రబాబు.. క్షేత్రస్థాయిలో రైతులకు అండ.. ఫొటోలు ఇవిగో!

06 Nov, 19:13

ఒకటి కాదు రెండు కాదు.. 70కి పైగా అవమానాలు భరించా!: విజయసాయిరెడ్డి

06 Nov, 18:51

మంచి దిగుబడితో పంట చేతికందే సమయంలో మురసు తుపాను దెబ్బతీసింది: రేటూరులో చంద్రబాబు

06 Nov, 18:08

60 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు.. ప్రభుత్వం తీసుకుంది 18 టీఎంసీలే: రేవంత్‌ సర్కార్‌పై హరీశ్‌ ఫైర్‌

06 Nov, 17:40

బాలరాజు యాదవ్ అరెస్ట్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

06 Nov, 17:37

ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చారా? ‘మాతృభూమి’పై సల్మాన్‌ ఖాన్‌ క్లారిటీ

06 Nov, 17:32

సెహ్వాగ్‌ తనయుడి విధ్వంసం.. అండర్‌-19 ఆసియా కప్‌లో భారత్‌ శుభారంభం

06 Nov, 17:29

శాంతిపురం కేసులో టీడీపీ ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి భారీ ఊరట.. కేసు కొట్టివేసిన కుప్పం కోర్టు

06 Nov, 17:27

ప్రపంచ మార్కెట్లు ఢమాల్‌.. భారత సూచీలు మాత్రం రయ్‌ రయ్‌: కారణాలివే..!

06 Nov, 16:54

సైబర్ సెక్యూరిటీలో సంచలనం.. హ్యాకర్లను మించిపోయే 'జీపీటీ-6' లాంచ్ చేసిన ఓపెన్ఏఐ

06 Nov, 16:50

కొచ్చి దాడి కేసులో అనూహ్య మలుపు.. బాధితుడైన డాక్టర్‌పైనే రేప్ కేసు!

06 Nov, 16:49

గోవా నుంచి బెంగాల్ వెళుతూ విశాఖలో ఆగిన హోవర్‌క్రాఫ్ట్‌లు.. చూసేందుకు జనం క్యూ!

06 Nov, 16:36

'రామాయణ'పై రకుల్ ప్రీత్ సింగ్ భావోద్వేగం

06 Nov, 16:27

టపాసుల శబ్దం 125 డెసిబుల్స్‌.. చెవులకు ఎంత మోతాదు ప్రమాదకరం? దీపావళి వేళ ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

06 Nov, 16:22
..More Telugu News