బోర్డర్ దాటే ప్రయత్నంలో అమెరికా పోలీసులకు పట్టుబడుతున్న భారతీయులు
- అక్రమంగా అమెరికాలో అడుగుపెడుతున్న వారిలో భారతీయులే ఎక్కువట
- గతేడాది 23 వేల మందిని అరెస్టు చేసిన అమెరికా పోలీసులు
- ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక మరింత కఠినంగా చట్టాల అమలు
కాగా, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక ఇమ్మిగ్రేషన్ చట్టాలను కఠినంగా మార్చిన విషయం తెలిసిందే. అక్రమ వలసలపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని బోర్డర్ పోలీసులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో చాలావరకు అక్రమ వలసలను అధికారులు కట్టడి చేశారు. శిక్షలకు భయపడి బోర్డర్ దాటేందుకు చాలామంది సాహసించడంలేదు. అయినప్పటికీ భారతీయులు మాత్రం ఎలాగైనా అమెరికాలో అడుగుపెట్టాలని బోర్డర్ క్రాస్ చేసేందుకు తెగిస్తున్నారని ఆరోపించారు.
యువతే ఎక్కువ..
బోర్డర్ దాటుతూ పట్టుబడ్డ భారతీయుల్లో యువతే ఎక్కువని, ఉద్యోగం కోసం, మంచి వేతనం కోసం వారు ఈ సాహసానికి పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. మరోవైపు, సరిహద్దుల్లో తల్లీతండ్రులు లేకుండా పిల్లలు మాత్రమే పట్టుబడుతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.