గ్రీన్ లాండ్ స్వాధీనంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- ఇరవై ఏళ్లుగా చెబుతున్నాం.. ఇప్పుడు టైమొచ్చిందన్న ట్రంప్
- తమ సూచనలను డెన్మార్క్ పెడచెవిన పెట్టిందని విమర్శ
- ఇన్నాళ్లుగా వేచి చూశాం.. ఇక తమ నియంత్రణలోకి తీసుకుంటామని వ్యాఖ్య
గ్రీన్ లాండ్ స్వాధీనం విషయంలో తన వైఖరిని సమర్థించుకుంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. గ్రీన్ లాండ్ ను తమ నియంత్రణలోకి తెచ్చుకోవడం ఖాయమని ఆయన తేల్చిచెప్పారు. రష్యాను ఎదుర్కోవడంలో డెన్మార్క్ విఫలం కావడంతో భద్రతా కారణాల దృష్ట్యా తాము ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. సమయం వచ్చింది కాబట్టే ఈ విషయంలో తాము కల్పించుకున్నామన్నారు.
ఎలాగైనా గ్రీన్‌లాండ్ ను స్వాధీనం చేసుకుంటామంటూ ఆదివారం ట్రూత్ సోషల్ లో పోస్ట్ పెట్టారు. కాగా, ఈ విషయంలో తమ వైఖరిని వ్యతిరేకించే దేశాలపై టారిఫ్ లు విధిస్తామని హెచ్చరించిన ట్రంప్.. అన్నట్లుగానే ఈయూ కూటమిలోని 8 దేశాలపై 10 శాతం టారిఫ్ లు విధించారు. ఫిబ్రవరి 1 నుంచి ఈ టారిఫ్ లు అమలులోకి వస్తాయని ట్రంప్ స్పష్టం చేశారు.