Medak: రూ.22 కోసం స్నేహితుడి దారుణ హత్య.. మెదక్‌లో దారుణం
- మద్యం మత్తులో స్నేహితుడిని చంపేసిన వలస కూలీ
- తలని చెట్టుకేసి కొట్టి, బండరాయితో మోది కిరాతకంగా చంపిన నిందితుడు
- పోలీసుల ఎదుట నేరం అంగీకరించి లొంగిపోయిన నిందితుడు మహేశ్
మెదక్ జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. కేవలం 22 రూపాయల బాకీ కోసం ఓ వ్యక్తి తన స్నేహితుడిని కిరాతకంగా హత్య చేశాడు. చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో పండుగ పూట జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోవడం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. యూపీకి చెందిన మహ్మద్ సిరాజ్, మహేశ్ కుమార్ వర్మ బతుకుదెరువు కోసం అనంతసాగర్ గ్రామంలో నివసిస్తూ కూలీ పనులు చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో గతంలో సిరాజ్ ఇవ్వాల్సిన రూ.22 బాకీ గురించి మహేశ్ ప్రస్తావించాడు. ఈ చిన్న విషయం కాస్తా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది.
మద్యం మత్తులో ఉన్న మహేశ్ తీవ్ర ఆగ్రహానికి గురై సిరాజ్‌పై దాడికి పాల్పడ్డాడు. సిరాజ్ తలను సమీపంలోని చెట్టుకు బలంగా కొట్టి, అనంతరం అక్కడే ఉన్న బండరాయితో తలపై మోదాడు. ఈ దాడిలో తలకు తీవ్ర గాయాలైన సిరాజ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇద్దరూ ప్రాణ స్నేహితుల్లా మెలిగేవారని, ఇంత చిన్న కారణానికి హత్య జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందని స్థానికులు పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న చేగుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు మహేశ్ కుమార్ వర్మ తన నేరాన్ని అంగీకరించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రూ.22 కోసం ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు జైలు పాలు కావడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.