సంక్రాంతికి ఒక్కటైన నేతలు... వైరల్ అవుతున్న నేతల ఏఐ వీడియో
- రాజకీయ ప్రత్యర్థులు కలిసి సంక్రాంతి చేసుకుంటున్నట్టు ఏఐ వీడియో
- బాబు, జగన్, పవన్, రేవంత్, కేసీఆర్ కలిసి పండుగ చేసుకుంటున్నట్లు చిత్రీకరణ
- భోగి మంటలు, పొంగలి, గాలిపటాలతో నేతల సందడి
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏఐ వీడియో
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. పచ్చని పొలాల మధ్య నేతలు నడుచుకుంటూ వెళ్లడం, భోగి మంటలు వేయడం, పొంగలి వండటం, ఆవులకు నైవేద్యం పెట్టడం, గాలిపటాలు ఎగరేయడం, ఒకరికొకరు స్వీట్లు పంచుకోవడం వంటి దృశ్యాలతో ఈ వీడియోను సహజంగా రూపొందించారు. ఈ క్రియేటివ్ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
వైసీపీ మద్దతుదారుడిగా పేర్కొంటున్న ‘పాపాలకేపాప (శాండీ పాప వైఎస్సార్సీపీ)’ అనే ‘ఎక్స్’ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. "అందరూ బాగుండాలి... అందులో నేనుండాలి" అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోకు మంచి స్పందన లభిస్తోంది. వేలాది వ్యూస్‌తో పాటు, "నిజమైన పండుగ అంటే ఇదే", "ఏఐ సృష్టించిందే అయినా, నేతలంతా ఇలా కలిసి ఉండటం చూడటానికి చాలా అందంగా ఉంది" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.