దేశంలో 549 రైళ్ల వేగాన్ని పెంచిన రైల్వే శాఖ
- దేశవ్యాప్తంగా 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టిన రైల్వే శాఖ
- కొత్త టైమ్‌టేబుల్‌లో పలు రైళ్ల వేగాన్ని పెంచుతున్నట్లు ప్రకటన
- మరో 86 రైళ్ల సర్వీసుల పొడిగింపు, 10 రైళ్లు సూపర్‌ఫాస్ట్‌గా మార్పు
- సౌత్ వెస్ట్రన్ రైల్వేలో అత్యధికంగా 117 రైళ్ల వేగం పెంపు
- ప్రయాణికులకు వేగవంతమైన సేవలే లక్ష్యమన్న రైల్వే మంత్రిత్వ శాఖ
కొత్త రైళ్లతో పాటు 86 రైళ్ల సర్వీసులను పొడిగించడం, 10 రైళ్లను సూపర్‌ఫాస్ట్‌గా మార్చడం, 8 రైళ్ల ఫ్రీక్వెన్సీని (ట్రిప్పుల సంఖ్య) పెంచడం వంటి చర్యలు తీసుకున్నట్లు వివరించింది. ఈ మార్పులతో రైళ్ల రాకపోకల్లో కచ్చితత్వం పెరిగి, ప్రయాణ సమయం తగ్గనుంది.
వివిధ జోన్ల వారీగా చూస్తే... సౌత్ వెస్ట్రన్ రైల్వే (SWR) పరిధిలో అత్యధికంగా 117 రైళ్ల వేగాన్ని పెంచారు. ఈ జోన్‌లోనే 8 రైళ్లను సూపర్‌ఫాస్ట్‌గా మార్చారు. ఇక సదరన్ రైల్వే (SR)లో 75 రైళ్ల వేగం పెరగగా, 6 కొత్త రైళ్లను ప్రవేశపెట్టారు. అదేవిధంగా నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR) పరిధిలో 89, వెస్ట్రన్ రైల్వే (WR)లో 80 రైళ్ల వేగాన్ని పెంచారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నార్తర్న్ రైల్వే జోన్లలో అత్యధికంగా చెరో 20 కొత్త రైళ్లను ప్రవేశపెట్టారు.
ఈ మార్పుల ద్వారా రైళ్ల కార్యకలాపాల సామర్థ్యం మెరుగుపడుతుందని, ప్రయాణికులకు మరింత వేగవంతమైన, నమ్మకమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని రైల్వే శాఖ స్పష్టం చేసింది.