సర్పంచ్ ల ప్రమాణ స్వీకారం తేదీలో మార్పు
- ఈ నెల 20న ప్రమాణం చేస్తారని తొలుత ప్రకటన
- ముహూర్తం బాలేదంటూ కొత్త సర్పంచ్ ల వినతి
- ఈ నెల 22వ తేదీకి మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలు
ముగిసిన మూడో విడత పోలింగ్..
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తంగా 182 మండలాల్లోని 4,159 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. 394 పంచాయతీలు, 7,908 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 3,752 గ్రామ పంచాయతీలకు, 28,410 వార్డులకు పోలింగ్ పూర్తయింది. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సాయంత్రానికి ఫలితాలు వెలువడనున్నాయి. తుది విడతలో సర్పంచ్ పదవులకు 12,652 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 75,725 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.