తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు
- హోలీ పండుగ నేపథ్యంలో ఎగ్జామ్ తేదీ మార్చిన ఇంటర్ బోర్డు
- మార్చి 3న జరగాల్సిన పరీక్ష మరుసటి రోజుకు వాయిదా
- మిగతా పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వెల్లడి
హోలీ పండుగ మార్చి 4న జరుగుతుందనే ఉద్దేశంతో ఇంటర్ బోర్డు పరీక్షల షెడ్యూల్ ను రూపొందించింది. అయితే, ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసిన సాధారణ సెలవుల జాబితాలో మార్చి 3న హోలీ పండుగ సెలవు రోజుగా ప్రకటించింది. దీంతో ఆ రోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. మిగతా పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని అధికారులు తెలిపారు.