వచ్చేసింది 'ఉస్తాద్..' ఫస్ట్ సింగిల్... 'దేఖ్ లేంగే సాలా' అంటున్న పవన్ కల్యాణ్

Entertainment
Advertisement
  • పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో 'ఉస్తాద్ భగత్ సింగ్'
  • నేడు తొలి పాట విడుదల
  • సోషల్ మీడియాలో ట్రెండింగ్
Advertisement
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తొలి పాట విడుదలైంది. 'దేఖ్ లేంగే సాలా' అంటూ సాగే ఈ పవర్‌ఫుల్ పాట లిరికల్ వీడియోను చిత్రబృందం శనివారం సాయంత్రం విడుదల చేసింది. ఈ పాట విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటకు ప్రముఖ గేయరచయిత భాస్కరభట్ల సాహిత్యం అందించారు. బాలీవుడ్ గాయకుడు విశాల్ దద్లానీ, హరిప్రియ తమ గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. శ్రోతల్లో ఆత్మవిశ్వాసం, స్ఫూర్తి నింపేలా ఈ పాటను తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది.

ఈ పాట విడుదలకు ముందు చిత్రబృందం ఒక వినూత్న ప్రచారానికి తెరలేపింది. తెలుగు సినిమాలో తొలిసారిగా లక్ష మంది అభిమానులతో పాట లిరిక్ షీట్‌ను విడుదల చేయించింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్‌సైట్‌లో అభిమానులు పాల్గొని, ఈ లిరిక్ షీట్‌ను ఆవిష్కరించారు. అనుకున్న సమయం కంటే వేగంగా లక్ష ఎంట్రీలు రావడంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. అయనాంకా బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
Advertisement

సంబంధిత వార్తలు

Pawan KalyanUstaad Bhagat SinghHarish ShankarDevi Sri PrasadSreeleelaDeekh Lenge Saala SongTelugu MovieMythri Movie MakersTollywoodVishal Dadlani

More Telugu News

అమెరికాలో ప్రకంపనలు.. చైనా గూఢచారితో ఎన్విడియా బాస్‌కు లవ్ ఎఫైర్!

07 Nov, 12:50

పులివెందులలో వైసీపీకి మరో షాక్.. జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ

07 Nov, 12:36

తిరుపతి కౌంటింగ్ కేంద్రంలో టెన్షన్.. ఒకేచోట పులివర్తి నాని, చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుటుంబాలు

07 Nov, 12:17

రెండో వన్డేలో భారత బౌలర్ల ధాటికి కివీస్ ఢమాల్.. టీమిండియా ముందు ఈజీ టార్గెట్‌!

07 Nov, 12:15

'E20 కాస్తా 420గా మారింది'.. ఇంధన సంస్థలు ప్రజలను మోసం చేస్తున్నాయి: రాహుల్ గాంధీ

07 Nov, 12:13

సీసీటీవీల పర్యవేక్షణలో కౌంటింగ్.. సాయంత్రం 4 గంటలకల్లా ఫలితాలు వచ్చే అవకాశం: ఎస్ఈసీ పునేఠా

07 Nov, 12:09

'కౌరిబురి: ది కర్స్ డ్ టెంపుల్' ( నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!

07 Nov, 12:07

దీపావళి ధమాకా.. దేశవ్యాప్తంగా రూ.5 లక్షల కోట్ల వ్యాపారం!

07 Nov, 11:36

కౌంటింగ్ వేళ.. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హౌస్ అరెస్ట్

07 Nov, 11:33

ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు.. కూటమి జోరు.. లేటెస్ట్ ట్రెండ్స్

07 Nov, 11:21

భలే పోటీ.. 60 రోజులు నిద్రపోయి రూ. 9.6 లక్షలు గెలుచుకుంది!

07 Nov, 11:13

బాల్ ట్యాంపరింగ్ కుట్ర.. ఆ ముగ్గురికే కాదు, జట్టు మొత్తానికీ తెలుసు: ఉస్మాన్ ఖవాజా

07 Nov, 10:52

ఓట్ల లెక్కింపునకు ముందే విషాదం.. జనసేన ఎంపీటీసీ అభ్యర్థి దివ్య మృతి

07 Nov, 10:49

17 ఏళ్ల నిరీక్షణకు తెర.. కూకట్‌పల్లి ఫ్లాట్లపై సుప్రీం కీలక ఆదేశాలు

07 Nov, 10:48

ఇరాన్‌తో యుద్ధమే లేదు.. ఇజ్రాయెల్‌ను నేనే కాపాడాను: ట్రంప్

07 Nov, 10:45
..More Telugu News