Narendra Modi: పుట్టపర్తికి ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన చంద్రబాబు, పవన్ కల్యాణ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు సత్యసాయి జిల్లా పుట్టపర్తికి విచ్చేశారు. ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘనంగా స్వాగతం పలికారు.
విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత, సత్య కుమార్ యాదవ్ సహా పలువురు కూటమి నేతలు ఉన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ పర్యటించడం ఇదే తొలిసారి.
అనంతరం, ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలిసి పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. అక్కడి సాయి కుల్వంత్ హాల్‌లో ఉన్న భగవాన్ శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పుట్టపర్తిలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.