కేఎల్ రాహుల్ సెంచరీ.. లంచ్ సమయానికి 56 పరుగుల ఆధిక్యంలో భారత్
అనంతరం క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్‌తో కలిసి రాహుల్ జాగ్రత్తగా ఆడుతూ పరుగులు పెంచుకుంటూ పోయాడు. ఈ క్రమంలో 19 బంతుల్లో కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. రాహుల్ శతకంలో 12 ఫోర్లు ఉన్నాయి. లంచ్ సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసి విండీస్ కంటే 56 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అంతకుముందు నిన్న టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయింది. సిరాజ్ 4 వికెట్లు తీసుకోగా, బుమ్రా మూడు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకున్నారు.