ఏపీ పర్యటనకు మోదీ... చంద్రబాబు, పవన్‌తో కర్నూలులో భారీ ర్యాలీ
- అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్‌కు రానున్న ప్రధాని మోదీ
- కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాని పర్యటన
- శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్న ప్రధాని
ఈ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఈ వివరాలను మంత్రి నారా లోకేశ్.. శాసనమండలి లాబీలో ఇతర మంత్రులు, ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ ప్రస్తావించినట్లు సమాచారం. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.